నిజాలను బీఆర్‌‌‌‌ఎస్‌‌ జీర్ణించుకోదు.. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు లక్షా 89 వేల కోట్లు : కవిత

నిజాలను బీఆర్‌‌‌‌ఎస్‌‌ జీర్ణించుకోదు.. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు లక్షా 89 వేల కోట్లు : కవిత
  • కానీ.. రాష్ట్రంలో కొత్తగా లక్ష ఎకరాలకే నీళ్లిచ్చిన్రు
  • ఈ విషయం చెప్తే నాపై సోషల్​ మీడియాలో దాడి చేస్తరు
  • కన్నెపల్లి పంప్​ హౌస్​ను​ పరిశీలించిన కవిత
  • కన్నెపల్లి వద్ద కాఫర్‍ డ్యాం నిర్మించాలని డిమాండ్‌‌

వరంగల్‍/భూపాలపల్లి/మహాదేవపూర్‍, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్​ పేరిట లక్షా 89 వేల కోట్లు ఖర్చు చేసి కొత్తగా లక్ష ఎకరాలకు మాత్రమే సాగునీరందించారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌) అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. నిజాలను బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్సోళ్లు జీర్ణించుకోలేరని, తాను ఈ విషయాలను చెప్పినందుకు సోషల్​ మీడియాలో  తిట్లతో దాడికి దిగుతారని అన్నారు.

నిజాలు ఎప్పటికీ మారవని, వాస్తవాలు కచ్చితంగా కఠినంగానే ఉంటాయని వ్యాఖ్యానించారు. సోమవారం జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్ హౌస్‌‌‌‌‌‌‌‌ను కవిత సందర్శించారు. అక్కడ గోదావరి ప్రవాహాన్ని పరిశీలించారు. పవర్‍ పాయింట్‍ ప్రజెంటేషన్‍ ద్వారా ప్రాజెక్ట్​ వివరాలు తెలియజేస్తూ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎల్‍నినో పరిస్థితుల నేపథ్యంలో పదేండ్ల బీఆర్‍ఎస్‍ సర్కార్‍, మూడేండ్ల కాంగ్రెస్‍ ప్రభుత్వాల వైఫల్యాలు బయటపడతున్నాయన్నారు.

కాంగ్రెస్‍ ప్రభుత్వం మేడిగడ్డను బూచిగా చూపుతూ గోదావరిని పట్టించుకోవట్లేదని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు రూ.26 వేల కోట్లు పెండింగ్‍ బకాయిల కింద చెల్లించినట్టు చెప్తున్న ప్రభుత్వం.. కొత్తగా ఒక్క ఎకరానికి నీళ్లివ్వలేకపోయిందని పేర్కొన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టును కూల్చికట్టాలని ‘నేషనల్‍ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌‌‌‌‌‌‌‌డీఎస్‌‌‌‌‌‌‌‌ఏ)’ చెప్పిన క్రమంలో.. రాష్ట్ర సర్కారు ఆ పనులు మొదలుపెట్టడానికి ఇదే సరైన సమయమని   తెలిపారు.

ప్రాణహిత నీళ్లు మళ్లించాలి

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కన్నెపల్లి పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌ వద్ద 93 మీటర్ల ఎత్తులో కాఫర్‍ డ్యామ్‍ నిర్మించి ప్రాణహిత నీటిని మళ్లించాలని కవిత డిమాండ్‍ చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టుతో సంబంధం లేకుండా ఇక్కడినుంచి అన్నారం, సుందిళ్లకు నీళ్లు ఎత్తిపోసి ప్రతి ప్రాజెక్టును రీచార్జ్​ చేసుకోవచ్చన్నారు. కేవలం రూ.25 కోట్లతో నెలన్నరలో పనులు పూర్తిచేయవచ్చని తెలిపారు.  రాష్ట్రంలో ఎల్‍నినో ప్రభావంతో రాబోయే 10 నెలల్లో మంచినీరు దొరకని పరిస్థితులుండే అవకాశం ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్లు ఖర్చుచేస్తేగానీ కాళేశ్వరం ప్రాజెక్ట్​ పూర్తయ్యే పరిస్థితి లేదన్నారు. ఈ క్రమంలో బాధ్యత కలిగిన టీఆర్‍ఎస్‍ పార్టీగా తాము రాజకీయాలు చేయకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం సూచనలు అందిస్తామన్నారు. వినకపోతే ఏంచేయాలో కూడా తమకు తెలుసని హెచ్చరించారు.  ప్రాణహిత నదివద్ద రోజుకు 2 టీఎంసీల నీళ్లు వృథాగా పోతున్నాయని, వాటిని సక్రమంగా వాడుకోవాలన్నారు. కాఫర్‍ డ్యాం నిర్మాణానికి సంబంధించి తమ వద్దనున్న టెక్నికల్‍ డీటెయిల్స్​ ప్రభుత్వానికి అందిస్తామన్నారు. నవంబర్‍ నెలాఖరులోగా కాఫర్‍ డ్యాం నిర్మించాలని, లేదంటే కన్నెపల్లి పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌ వద్ద ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

మీరు రాజకీయాలు బంద్‌‌‌‌‌‌‌‌ పెడ్తరా? 

కరీంనగర్, వెలుగు: రైతులను వ్యవసాయం వద్దంటున్న సీఎం.. రాజకీయాలు బంద్ పెడతారా? అని  కవిత ప్రశ్నించారు.  కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపురం గ్రామంలో ఎండిపోయిన పంటలను ఆమె పరిశీలించారు.  ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రాణహిత వద్ద నీళ్లు ఎత్తిపోస్తే రైతుల పంటలను కాపాడవచ్చని తెలిపారు. రైతులను పంటలు వేయొద్దని గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం కూడా చెప్పలేదని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ప్రాజెక్ట్ ఫెయిలైందా? పాసైందా? అన్నది పక్కన పెడితే.. రైతులను కాపాడే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. 24 గంటలు కరెంట్ ఇవ్వాలని , నీళ్లను ఎత్తిపోయాలని, రైతుల పంట నష్టాన్ని అంచనా వేయాలని తమ పార్టీ తరఫున డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నామని తెలిపారు.